ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీ.. గ్యాస్‌ కట్టర్‌తో సేఫ్‌ లాకర్‌ను..

By అంజి  Published on  25 Jan 2020 12:07 PM GMT
ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీ.. గ్యాస్‌ కట్టర్‌తో సేఫ్‌ లాకర్‌ను..

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బ్యాంక్‌లో దుండగులు భారీ చోరికి యత్నించారు. మామిడికుదురు మండలంలోని 216 నేషనల్‌ హైవే పక్కన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నిన్న అర్థరాత్రి దొంగతనానికి ప్రయత్నించారు. గ్యాస్‌ కట్టర్‌ ద్వారా మెయిన్‌ తాళం కట్‌ చేసి దుండగులు బ్యాంక్‌ లోపలికి వెళ్లారు. సేఫ్‌ లాకర్‌ను ఓపెన్‌ చేయలేక దుండగులు గ్యాస్‌ సిలిండర్‌ను అక్కడే వదిలివెళ్లిపోయారు. ఇవాళ ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్‌ మేనేజర్‌ తెలిపారు. భారీ చోరికి యత్నించిన దుండుగులు చిన్నపాటి మొత్తంతో పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Next Story