ఎస్‌బీఐ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ తమ అకౌంట్లకు కేవైసీ ప్రక్రియ ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని, లేకపోతే ఖాతా రద్దు చేయడం జరుగుతుందని ఎస్‌బీఐ హెచ్చరించింది. పాస్‌పోర్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడి కార్డు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కార్డు, ఎన్‌పీఆర్‌ పత్రం లాంటి అవసరమైన డాక్యుమెంట్లను సమీపంలోని బ్యాంకులో సమర్పించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. కేవైసీ చేసుకోలేని పక్షంలో ఖాతాను నిలిపివేయడం జరుగుతుందని ఎస్బీఐ పేర్కొంది.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం..

ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు ఖాతాదారులు ప్రతీసారి ఆప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వినియోగదారుని కేవైసీ వివరాలు పెండింగ్‌లో ఉన్నా.. వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా అలర్ట్‌ పంపాలని ఆర్బీఐ పేర్కొంది. కాగా, బ్యాంకులు ఖాతాదారుల కేవైసీ నిబంధనలు అతిక్రమించినట్లయితే ఆర్బీఐ భారీ జరిమానా విధిస్తోంది. ఈ నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, కో ఆపరేటివ్‌ బ్యాంకు, నాన్‌బ్యాకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.