జర్నలిస్ట్ హత్యపై ఏపీ డీజీపీ సవాంగ్ సీరియస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2019 10:16 PM ISTఅమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జర్నలిస్ట్ హత్య, శ్రీకాకుళం జిల్లాలో దాడి ఘటనలపై డిజిపి గౌతంసవాంగ్ సీరియస్. తుని ఎస్ఐ, శ్రీకాకుళం జిల్లా జలుమూరు ఎఎస్ఐ, ఇన్ చార్జ్ ఎస్ఐల సస్పెన్షన్ కు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై ఎటువంటి దాడులను సహించేది లేదన్న డీజీపీ ప్రకటించారు. శాంతి , భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని డీజీపీ చెప్పారు.
జర్నలిస్ట్ శ్రీనివాస్ తరువాత తక్షణమే స్పందించిన సీఎం వైఎస్ జగన్ కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అప్పుడే ఆదేశించారు .హత్య చేసిన వారిని, వారి వెనుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా చెప్పారు.
ఏపీలో జర్నలిస్ట్ హత్య, దాడులపై జర్నలిస్ట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏపీ డీజీపీ సవాంగ్‌కు వినతి పత్రం ఇచ్చారు జర్నలిస్ట్‌లు. జర్నలిస్ట్‌లపై భవిష్యత్తులో దాడులు జరగకుండా చూడాలని జర్నలిస్ట్ సంఘాలు సవాంగ్ కు విజ్ఞప్తి చేశాయి.