* సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
* ట్విట్టర్ లో పోస్టుల వెల్లువ

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.  పవన్ కళ్యాణ్ లాంటి  స్టార్స్ ఈ ప్రచారానికి మద్దతు తెలపడంతో ప్రచారం ఊపందుకుంది. అంతకుముందు నల్లమలలో యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా స్వరం పెంచిన పవన్ కళ్యాణ్ “ సేవ్‌ నల్లమల భూమి మనిషికి చెందినది కాదు, మనిషి భూమికి చెందినవాడు అంటూ తన ట్విట్టర్లో రాశారు.

యురేనియం కొనగలం..కాని  అడవులను కొనగలమా ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు  విజయ్ దేవరకొండ. ఇదే బాటలో మరికొందరు తారలు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తూ సేవ్ నల్లమల ప్రచారానికి మద్దతు తెలుపుతున్నారు.

యురేనియం మైనింగ్ కు వ్యతిరేకంగా ఆన్లైన్ ద్వారా సంతకాల సేకరణ పత్రంపై తాను సంతకం చేశానని నటి సమంత తెలిపారు. యురేనియం మైనింగ్ నుండి నల్లమల అడవులను కాపాడండి అంటూ ఆన్లైన్ పత్రంలో సంతకం చేయాలని రాష్ట్రపతిని ఆమె కోరింది.

మరికొందరు తారలు ఈ ప్రచారానికి మద్దతు కూడగట్టేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నటి అనసూర్య భరద్వాజ్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు.

“సో .. మనం సరిగ్గా ఏమి చేస్తున్నాం ?? అభివృద్ధి????? ఎవల్యూషన్ ????? ఏం ఉద్దరిద్దామని ???? మనం పెద్ద మూర్ఖులం !!!! ప్లీజ్ !!!!! ఒక్కసారిగా మనల్ని మనం చెంపదెబ్బ కొట్టుకుని మేల్కొలుపుకోవాలి !!!! ”, అంటూ అనసూయ తన ట్విట్టర్లో  రాసుకుంది.

నటుడు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా వ్రాశారు. “జీవించే ప్రతి దానిపై దయ చూపండి! సేవ్ నల్లమల “. సెలబ్రిటీలు ఆన్‌లైన్ ప్రచారాలను ప్రారంభించిన తరువాత, ఈ సమస్యపై ప్రజలు స్పందించడం ప్రారంభమైంది. స్టాప్ యురేనియం మైనింగ్,”  #సేవ్ నల్లమల అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.