షారుఖ్ - అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2019 12:14 PM GMTతమిళ దర్శకుడు అట్లీ ఇటీవల తెరకెక్కించిన 'బిగిల్' మూవీ తెలుగులో 'విజిల్' టైటిల్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. దీంతో అట్లీ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. గత కొంత కాలంగా అట్లీ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో సినిమా చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి.
ఇప్పటి వరకు ఇంటర్నెట్ లో రూమర్స్ గా ఉన్న ఈ వార్త నిజం అయ్యింది. జస్ట్ హీరో నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. దాదాపు స్టోరీ డిస్కషన్స్ షెడ్యూల్స్ ప్లానింగ్ వంటి విషయాల పై ఒక నిర్ణయానికి వచ్చిన షారుక్ సినిమా టైటిల్ ని కూడా వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 2న షారుక్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ మెంట్ వెలువడనున్నట్లు టాక్ వచ్చింది.
ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. ‘సంకీ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలిసింది. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అట్లీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజైన అట్లీ బిగిల్ మూవీ దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటింది. అయితే డిసెంబర్ లో అట్లీ - షారుక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.