మహేష్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 5:05 AM GMT
మహేష్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నేడు 45వ పడిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేష్‌కి అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. ఇక మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీస్‌ నిర్మాణ సంస్థ అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవలే మహేష్‌ తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా.. ‘స‌ర్కారు వారి పాట టైటిల్‌’ని ప్ర‌క‌టిస్తూ ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఇక తాజాగా ప్రిన్స్ బ‌ర్త్ డే స్పెష‌ల్ సంద‌ర్భంగా.. మోష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది.

44సెకన్ల పాటు ఉన్న మోషన్‌ పోస్టర్‌లో తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. గ‌తంలో లాగే మ‌రోసారి రూపాయి బిళ్ల‌తో మ్యాజిక్ చేస్తూ సినిమాపై ఆస‌క్తి రేకెత్తించారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన కీర్తీ సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్ల‌స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.

Next Story