టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ బాబు సరసన రష్మీక మంధాన కథనాయికగా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత రాజకీయాల నుంచి కెమెరా ముందుకు వచ్చారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఆమె లుక్ విడుదల చేసింది. ” సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి భారతీగా లేడీ లేడీ అమితాబ్ “అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

sareleri-neekevaru-vijayashanthi-look

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.