జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. పేదల కోసం సరికొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.10కే ధోతి లేదా లుంగీ, రూ.10కే చీరను ఏడాదికి రెండు సార్లు అందజేస్తామని ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం హేమంత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ ఆహారం భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలోని అర్హత గల లబ్దిదారులందరికీ, అంత్యోదయ అన్నా యోజన కింద అర్హత సాధించిన కుటుంబాలకు ఆరు నెలల వ్యవధిలో బట్టలు అందజేస్తామని తెలిపారు. కాగా, హేమంత్‌ సోరెన్‌ నాయకత్వంలోని ఝూర్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ, ప్రజలకు ధోతీలు, చీరలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాగా, జార్ఖండ్‌ ప్రభుత్వం పేదల ప్రజలకు మరింత చేయూత అందించే విధంగా ఎప్పటికప్పుడు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేద ప్రజలందరికీ మెరుగైన ప్రమాణాలతో కూడిన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *