బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్‌ త‌న‌య‌, హీరోయిన్ సారా అలీ ఖాన్‌పై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అంత‌లా సీరియ‌స్ అయ్యే ప‌ని ఈ అమ్మ‌డు ఏం చేసింది అనుకుంటున్నారా..? వివ‌రాళ్లోకెళితే.. త‌న సోద‌రుడి బ‌ర్త్‌డే వేడుక‌లకు సారా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. త‌న త‌మ్ముడిని ట్రిప్‌కు తీసుకెళ్లింది.

అక్క‌డ సారా.. త‌న‌ త‌మ్ముడితో ఫోటోల‌కు ఫోజిచ్చింది. త‌మ్ముడితో పోటీలు దిగితే.. త‌ప్పేంటి అంటారా.. అవును త‌ప్పుంది అంటున్నారు నెటిజ‌న్లు. సముద్ర తీరాన బికినీతో ఉన్న సారా.. ఇబ్రహీంతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసి.. తమ్ముడికి బర్త్‌ డే విషెస్ చెప్పింది.

అయితే ఈ ఫొటోల్లో సారా బికినీ ధరించి ఉండటం వ‌ల‌న‌.. నెటిజన్లు ఆమెపై ఘోరంగా ఫైర్ అవుతున్నారు. తమ్ముడి పక్కన నిల‌బ‌డే తీరు అదేనా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎంత హీరోయిన్‌ అయితే మాత్రం.. తమ్ముడి పక్కన ఇలా నిలబడటం పద్దతి కాదని అంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.