కవల బాలికలపై మూడేళ్లుగా మేనమామ.. ఏడాది నుంచి తండ్రి అత్యాచారం..

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కుతూళ్లపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే కాకుండా బాలికలపై మేనమామ కూడా గత మూడు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల స్కూల్‌ టీచర్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో.. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ నగరంలోని కాశిబుగ్గకు చెందిన భార్య, భర్తలకు ఇద్దరు 14 ఏళ్ల వయసున్న కవల కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కవలల తండ్రి, మేనమామ ఇద్దరు సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా బాలికలు.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలికల తండ్రి, మామ వావీ వరసలు మరిచారు. ఇద్దరిపై కన్నేశారు. ఒకరికి తెలియకుండా మరోకరు ఇద్దరిని లోబర్చుకొని అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలా మూడు సంవత్సరాలుగా ఇద్దరి బాలికలపై మేనమామ తన కామంతో కాటేస్తూ వచ్చాడు.

Also read:

కోచింగ్ ఇస్తానని చెప్పి..మూడేళ్లుగా ఒక్కొక్కరిపై

ఇదిలా ఉంటే సొంత తండ్రి కూడా గత సంవత్సర కాలంగా బాలికలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పుకోలేక బాలికలు తమలోనే తామే కుమిలిపోయేవారు. కాపాడాల్సిన వారే తమ జీవితాలను నాశనం చేస్తుంటే ఏమి చేయలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయాన్ని బాలికలు.. తమ స్కూల్‌ టీచర్లకు చెప్పారు. దీంతో బాలికలు చెప్పిన మాటలు విని టీచర్లు కంగుతిన్నారు. వెంటనే వరంగల్‌ షీ టీమ్స్‌కు టీచర్లు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also read:

బాత్రూమ్‌లో బీటెక్‌ విద్యార్థిని మృతదేహాం.. అసలేం జరిగిందంటే..

తండ్రి, మేనమాలను ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. సొంత, పరాయి అన్న తేడా లేకుండా మహిళలపై, బాలికలపై కామ మృగాలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఫలితాలు మాత్రం.. శూన్యంలా కనిపిస్తున్నాయి. కడుపున పుట్టిన బిడ్డలను కూడా కామపిశాచులు వదలడం లేదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.