ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన సారా అలీఖాన్‌..!

By అంజి
Published on : 21 Jan 2020 2:14 PM IST

ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన సారా అలీఖాన్‌..!

'ల‌వ్ ఆజ్ క‌ల్' సినిమా షూటింగ్ పూర్తి కాకున్నా చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ఇప్ప‌టి నుంచే షురూ చేసేసింది. తాజాగా, హీరో హీరోయిన్లు కార్తీక్ ఆర్య‌న్‌, సారా అలీఖాన్ హిందీ బిగ్‌బాస్ సెట్‌లో మెరిసారు. షోను హోస్ట్ చేస్తున్న స‌ల్మాన్‌తో క‌లిసి బిగ్‌బాస్ సెట్‌లో సంద‌డి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

కాగా, హిందీ బిగ్‌బాస్ 13వ వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. సారా అలీ ఖాన్ తన సహనటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి బిగ్ బాస్ సెట్‌లో వారి 'లవ్ ఆజ్ కల్' చిత్రం ప్రమోషన్ కోసం వచ్చారు. వారి సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు సెట్‌లో చాలా సరదాగా గడిపారు. ఈ వీడియోలో హీరో, హీరోయిన్ల‌ను ఆలింగనం చేసుకున్న స‌ల్మాన్ ఖాన్ ల‌వ్ ఆజ్ క‌ల్ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

Sara ali khan

సారా అలీ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సల్మాన్ ఖాన్, కార్తీక్ ఆర్యన్‌లతో కలిసిన‌ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్ప‌టికే దాదాపు 3 మిలియన్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ కూడా తమ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌తో చాలా సరదాగా గడిపారు.

సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్య‌న్‌ల‌ 'లవ్ ఆజ్ కల్' చిత్రం ఫిబ్రవరి 14న విడుదలకానుంది. 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించారు.అయితే, ఈ చిత్ర ట్రైలర్‌కు సంబంధించి సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ నుంచి వ‌చ్చిన స్పంద‌న బాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. సీక్వెల్ ల‌వ్ ఆజ్ క‌ల్ -2 కంటే మొదట వ‌చ్చిన ల‌వ్ ఆజ్ క‌ల్ చిత్ర ట్రైల‌ర్ బాగుందంటూ కితాబిచ్చాడు సైఫ్ అలీ ఖాన్‌.

Next Story