సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఏపీలో ముందుగా గుర్తుకు వచ్చేది కడి పందేలు. పండగకు నెల రోజుల ముందు నుంచే కోడి పందేలు నిర్వహించేందుకు రెడీ అవుతారు. కాగా, ప్రతిసారిలాగే  సారి కూడా పందేలాకు సిద్ధమవుతున్న తరుణంలో  పందేల వివాదం తెరపైకి వచ్చింది. కోడి పందేల నియంత్రణపై 2016లో హైకోర్టు జారీ చేయబడ్డ ఉత్తర్వులను సర్కార్‌ ఏమాత్రం అమలు చేయడం లేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విచారణలో భాగంగా ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యక కమిటీలు ఏర్పాటు చేసి కోడిపందేలు జరుగకుండా తగు చర్యలు చేపట్టాలని హైకోర్టుకు విన్నవించారు. ఇందుకు స్పందించిన ప్రధాన న్యాయమూరత్ఇ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఏపీ సర్కార్‌కు పలు ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా జరిగే కోడిపందేల నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టారో పూర్తి వివరాలు అందజేయాలని సూచించింది. తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.