సానియామీర్జా చెల్లెలి పెళ్లి.. మీరూ ఓ లుక్కేయండి..!

By రాణి  Published on  31 Dec 2019 5:55 AM GMT
సానియామీర్జా చెల్లెలి పెళ్లి.. మీరూ ఓ లుక్కేయండి..!

ప్ర‌ముఖ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా సోద‌రి ఆనం మీర్జా త‌న పెళ్లి వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా, ఈ నెల 11న భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కుమారుడు అస‌ద్‌తో ఆనం మీర్జా వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వారి పెళ్లి వీడియోను ద‌యామి ఫిల్స్మ్ సంస్థ షూట్ చేసింది. తాజాగా, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ వీడియోలో సానియా మీర్జాతోపాటు, త‌న త‌ల్లిదండ్రులు ఎమోష‌న‌ల్ అవుతున్న స‌న్నివేశాల‌ను చూడ‌వ‌చ్చు.

ఈ వివాహ వీడియో మొద‌ట‌గా ఆనం మీర్జా, సానియా మీర్జా త‌ల్లి ఇంట‌ర్వ్యూతో ప్రారంభ‌మ‌వుతుంది. ఆనం మీర్జా, అస‌ద్‌లు ఒక‌రికొక‌రు పుట్టార‌ని త‌న త‌ల్లి ఆ ఇంట‌ర్వ్యూలో పేర్కొంది. ఆ త‌రువాత సానియా మీర్జా ఇంట‌ర్వ్యూ ప్రారంభ‌మ‌వుతుంది. త‌న మాట‌ల్లో వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉండ‌టం తాను చూశాన‌ని, వారు జీవితాంతం అలానే ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పింది. తెగ వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఆనం మీర్జా మెహందీ ఫంక్ష‌న్‌, రిసెప్ష‌న్ మ‌రియు వివాహ వేడుక‌ల‌ను చూడ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను ఆనం మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో 58,128 మంది వీక్షించారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Next Story
Share it