ఫెడ్ కప్‌ హార్ట్‌ అవార్డుకు సానియా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2020 12:57 PM IST
ఫెడ్ కప్‌ హార్ట్‌ అవార్డుకు సానియా..

భార‌త్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మ‌రో ఘ‌న‌త సాధించింది. ఆసియా-ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. ఆమెతోపాటు ఇండోనేషియాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో కూడా నామినేట్ అయింది.

నాలుగేళ్ల త‌రువాత‌ సానియా ఫెడ్ క‌ప్‌లో ఇటీవ‌లే పునరాగ‌మ‌నం చేసింది. 18 నెల‌ల త‌ను కుమారుడు ఇజాన్ ను స్టాండ్స్‌లో ఉంచి ఆడి.. తొలిసారి ప్లే ఆఫ్స్‌కు భార‌త్ అర్హ‌త సాధించేందుకు సాయం చేసింది. ఈ అవార్డుకు ఎంపిక‌వ్వ‌డం ప‌ట్ల సానియా ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా సానియా మాట్లాడుతూ.. 2003లో తొలిసారి భార‌త జెర్సీ ధ‌రించి కోర్టులో బ‌రిలోకి దిగ‌డాన్ని ఎన్న‌టికి మ‌ర్చిపోలేన‌ని, 18ఏళ్ల సుధీర్ఘ ప్ర‌యాణంలో భార‌త టెన్నిస్ విజ‌యాల్లో భాగ‌మైనందుకు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని, గ‌త నెల‌లో ఫెడ్ క‌ప్ ఫ‌లితం నా కెరీర్‌లో అత్యుత్త‌మ ఘ‌న‌త‌ల్లో ఒక‌టి. నా ప్ర‌తిభ‌ను గుర్తించిన ఫెడ్‌క‌ప్ హార్ట్ అవార్డు సెల‌క్ష‌న్ ప్యానెల్‌కు ధ‌న్య‌వాదాలు అని సానియా అంది.

ఫెడ్‌ కప్ హార్ట్ అవార్డుల 11వ ఎడిషన్ కోసంఈ ఏడాది ఐరోపా-ఆఫ్రికా జోన్ నుంచి అనెట్ కొంటావి‌ట్‌(ఎస్తోనియా), ఎలియోనోరా మొలినారో(ల‌క్సెంబ‌ర్గ్‌) అమెరికా త‌రుపున ఫెర్నాండ గోమెజ్‌(మెక్సికో), వ‌రోనికా రాయ్‌గ్‌లు కూడా ఎంపిక‌య్యారు. మే 1 నుంచి 8 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వ‌హించి విజేత‌ల్ని నిర్ణ‌యిస్తారు.

Next Story