ఇజాన్ త‌న తండ్రిని ఎప్పుడు చూస్తాడో : సానియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2020 2:05 PM IST
ఇజాన్ త‌న తండ్రిని ఎప్పుడు చూస్తాడో : సానియా

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌న కొడుకు ఇజాన్ ను చూస్తే భాద‌క‌లుగుతోంద‌ని భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంది. ఇజాన్ త‌న తండ్రిని ఎప్పుడు చూస్తాడోన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. వీడియో కాల్ దూరాన్ని మాత్ర‌మే త‌గ్గించ‌గ‌ల‌ద‌ని, కానీ వ్య‌క్తిగ‌తంగా కల‌వ‌డానికి ప్ర‌త్యామ్నాయం కాదని చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్ కార‌ణంగా సానియా త‌న త‌ల్లిదండ్రులు, కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌లో ఉంటుండ‌గా.. ఆమె భ‌ర్త పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ పాకిస్థాన్‌లో ఉన్నాడు.

తాజాగా సానియా ఫేస్ బుక్‌లైవ్‌లో మాట్లాడింది. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం తాను త‌ల్లిదండ్రులు, కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్ లో ఉంటున్నాన‌ని, త‌న భ‌ర్త షోయ‌బ్ పాకిస్తాన్‌లో త‌న త‌ల్లితో ఉంటున్నాడ‌ని చెప్పింది. మా కుమారుడు ఇజాన్ త‌న తండ్రి ఎప్పుడు వ‌స్తాడ‌ని అడుగుతున్నాడు. వాడికి స‌మాధానం చెప్ప‌డం క‌ష్టంగా ఉంద‌ని చెప్పింది. ఇజాన్‌ తన తండ్రిని ఎప్పుడు చుస్తాడో తెలియదు. ఆ క్షణం వచ్చాక షోయబ్‌ను‌, ఇజాన్‌ను ఆపడం కష్టమ‌ని చెప్పుకొచ్చింది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచం క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొంటోంది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో షోయ‌బ్ త‌న త‌ల్లితో ఉండ‌డ‌మే మంచిద‌ని చెప్పింది. 'ఆమెకు 65 సంవ‌త్స‌రాలు. ఒక‌రి సాయం ఆమెకు ఎంతో అవ‌స‌రం. ఈ కఠిన సమయంలో అతను అక్కడ ఉండడమే మంచిదైంద‌ని చెప్పింది. ఈ వైరస్ భారి నుండి అందరం సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నాన‌ని. గత రెండు రోజుల నుండి సరిగా నిద్ర పట్టడం లేదని చెప్పింది. ఎప్పుడు మా కుటుంబం అంతా తిరిగి ఒకే దగ్గరికి చేరుతుందో అని ఎదురుచేస్తున్నాను' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో టెన్నిస్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేద‌ని చెప్పింది.

Next Story