మెగాస్టార్‌కు సందీప్ రెడ్డి కథ చెప్పాలనకుంటున్నారట...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 1:03 PM GMT
మెగాస్టార్‌కు సందీప్ రెడ్డి కథ చెప్పాలనకుంటున్నారట...!

అర్జున్ రెడ్డి... సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌లో క‌బీర్ సింగ్ టైటిల్‌తో రీమేక్ అయ్యింది. అక్క‌డ కూడా రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డంతో సందీప్ రెడ్డికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి టాలీవుడ్‌లో సినిమా చేస్తాడు అనుకుంటే... బాలీవుడ్‌లో భారీ ఆఫ‌ర్ రావ‌డంతో అక్క‌డే నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే... సందీప్ రెడ్డి ద‌గ్గ‌ర మెగాస్టార్‌కి స‌రిపోయే క‌థ ఉంద‌ట‌. ఆ క‌థ‌ను మెగాస్టార్‌కి చెప్పాల‌నుకుంటున్నాడ‌ట‌. మెగాస్టార్‌తో సినిమా చేయ‌క‌పోయినా ఫ‌ర‌వాలేదు కనీసం క‌థ చెప్పిన చాలు అని సందీప్ రెడ్డి త‌న స‌న్నిహితుల‌తో చెప్పాడ‌ట‌. మెగాస్టార్ ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్నాడు. న‌వంబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆత‌ర్వాత త్రివిక్రమ్, సుకుమార్‌ల‌తో సినిమాలు చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మెగాస్టార్ యంగ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అంతే కాకుండా చ‌ర‌ణ్ తో సందీప్‌కి మంచి స్నేహం ఉంది. సో... సందీప్ రెడ్డికి చిరు క‌థ చెప్పేందుకు ఛాన్స్ ఇవ్వ‌చ్చు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి క‌థ‌తో మెప్పిస్తే... అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ ఆశ నెర‌వేర‌డం ఖాయం.!

Next Story
Share it