ఉదయ్ కిరణ్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్
By Newsmeter.Network Published on 27 Nov 2019 3:14 PM ISTఉదయ్ కిరణ్.. బయోపిక్ గత రెండు రోజులగా వార్తల్లో నిలిచింది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్ర పోషించనున్నారని... ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్నారు. అలాగే త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని.. ఓ నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నాడని... ఇలా జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా నిజమా..? కాదా..? అంటే నిజమే అని వార్త వచ్చింది.
అయితే ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే..? అందులో చిరంజీవి కుమార్తెతో పెళ్లి ప్రస్తావన.. అది క్యాన్సిల్ అవడం. ఆ తర్వాత ఉదయ్ కెరీర్ లో బాగా వెనకబడిపోవడం... అవకాశాలు రాకపోవడంతో మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ ఉంటాయని సమాచారం.
అయితే మెగా క్యాంప్ నుంచి సందీప్ కి ఎవరైనా ఫోన్ చేసి ఆ సినిమా చేయద్దని చెప్పారో..? లేకపోతే మెగా ఫ్యాన్స్ తో ఇబ్బందులు వస్తాయి. ఎందుకొచ్చిన తలపోటు అనుకున్నాడో ఏమో కానీ.. ఈ బయోపిక్ వార్తల పై సందీప్ కిషన్ స్పందించాడు.
ఇంతకీ ఏమన్నాడంటే... ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి రెండు రోజుల నుంచి పుకార్లు వింటున్నాను. ఈ బయోపిక్ గురించి తనని ఎవరూ సంప్రదించలేదని.. ప్రస్తుతానికైతే ఎలాంటి బయోపిక్స్ చేసే ఆలోచన లేదని సందీప్ కిషన్ మీడియాకి తెలియచేశారు. మొత్తానికి అదీ.. సంగతి..!