అనసూయ, రష్మీలకు సమీర అద్దిరిపోయే కౌంటర్.. తోపులెవరో త్వరలోనే తెలుస్తుంది..!
By రాణి Published on 19 Feb 2020 4:57 AM GMTబుల్లితెర పాలిటిక్స్.., ఈ పదం ఇదివరకే విన్నదే అయినా ఇటీవల ప్రేక్షకుల నోళ్లలో తెగ నానుతోంది. అందుకు ప్రధాన కారణం జబర్దస్త్, అదిరింది కామెడీ షోలేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో జబర్దస్త్ షోలోని వారు పండుగలు, పబ్బాలు రోజున గ్రూపులుగా విడిపోయి ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రత్యర్ధులుగా కనిపిస్తూ ఉండేవారు. అటువంటి సీనే ఇప్పుడు రియాల్టీలో కనిపిస్తోంది. జబర్దస్త్‌లోని నాగబాబుతోపాటు కొందరు కంటెస్టెంట్‌లు అదిరింది షోకు షిప్ట్ కావడంతో ఒకరిపై మరొకరు సెటైర్‌లు వేసుకుంటూ జనాలను ఎంటర్‌టైన్ చేయడం మానేశారు. దీంతో రెండు షోలూ డీలా పడ్డాయన్న కామెంట్లు బుల్లితెర అభిమానుల నుండి వినిపిస్తున్నాయి.
ఇక బుల్లితెర పాటిలిక్స్ విషయానికొస్తే, జబర్దస్త్ ఏంజెల్స్ అనసూయ - రష్మీ, అదిరింది షో క్వీన్ సమీరల మధ్య చాపకింద నీరులా సైలెంట్ వార్ బాగానే జరుగుతోందన్నది టాక్. అందులో భాగంగానే వీరు స్కిట్‌లో పాటిస్పేట్ చేయకపోయినా పర్ఫామెన్స్ చేసే కంటెస్టెంట్‌ల స్రిప్ట్‌లలో ఒకరి షోపై మరొకరు సెటైర్లు వేసేలా డైలాగ్‌లు ప్రత్యేకంగా రాయిస్తున్నారట. అందులో యాంకర్ల పాత్ర లేకపోలేదు సుమీ..!
ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన సమీర అదిరింది షో చేయాలని ఎలా అనిపించింది..? సీరియల్స్‌లలో నటించడానికి కారణమేంటి..? వంటి ప్రశ్నలతోపాటు మరికొన్నింటికి సమాధానం చెప్పుకొచ్చింది.
ఆ సమాధానాలు సమీర మాటల్లో..
బుల్లితెరకు రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నా దృష్టంతా స్పోర్ట్స్‌పైనే ఉండేది. అనుకోకుండా టెలివిజన్‌లోకి వచ్చినా ఒక్క సీరియల్‌తోనే ఆపేద్దామనుకున్నా. కానీ, సంవత్సరాలు సంవత్సరాలు సీరియల్స్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.
సీరియల్స్‌లో నటిస్తూ ఉండగా అదిరింది షోను హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. మునుపటిలా ఎక్కువ మాట్లాడలేకపోవడంతో హోస్టింగ్ చేయలేనేమో అనుకున్నా. అలా అనుకోవడానికి, ఎక్కువగా మౌనంగా ఉండటానికి ప్రధాన కారణం బుల్లితెరపై నేను నటిస్తున్న సీరియల్స్ క్యారెక్టరే. సీరియల్స్ పుణ్యమా అని హైపర్ యాక్టివ్‌గా ఉండాల్సిన నేను కామ్ సూపర్ లేడీగా మారిపోయా.
సీరియల్స్‌లలో కూడా చాలా రోజులపాటు గ్యాప్ రావడంతో తెలుగు ఆడియన్స్ కోరిక మేరకు అదిరింది షోను హోస్టింగ్ చేసేందుకు ఒప్పుకున్నా. తెలుగు ఆడియన్స్ కోసం అదిరిందికన్నామంచి కంబ్యాక్ మరేమీ లేదని నాకు అనిపించలేదు. ఇలాంటి షో చేస్తున్నప్పుడు సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని నా మంచి కోరేవారందరూ చెప్పారు. అలాగే చాలా స్పాంటినిటీగా ఉండాలని సూచించారు. ఇక అప్పట్నుండి వాటన్నింటిని ముందుగా ప్రిపేర్ అయి బుల్లితెర కామెడీ షోలో కనపడుతున్నా.
జనరల్‌గా నా మీద ఎవరైనా జోక్‌లేసినా, నన్ను ఇమిటేట్ చేసినా, నా మీద ఫన్నీగా ఏమన్నా మాట్లాడినా కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తా. ఒక కామెడీని ఎంజాయ్ చేయాలంటే మొదట మన మీద మనమే కామెడీ తయారు చేసుకోవాలి. అలా ముందు నుండే నన్ను ఇమిటేట్ చేసినప్పుడు ఫీలవడం కన్నా నార్మల్ కంటే ఎక్కువ ఎంజాయ్‌మెంట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది సమీర.
చివరగా, జబర్దస్త్‌లో తన యాంకరింగ్ మీడ పేలుతున్న పంచ్‌లకు సమాధానంగా ఎవరు కూడా వచ్చీరాగానే తోపులుగా రాలేదని, ప్రతీ ఒక్కరు కూడా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన వారేనంటూ డైరెక్ట్ ఎటాక్ చేసింది. తన మొదటి అదిరింది ఎపిసోడ్కు, ప్రస్తుత ఎపిసోడ్‌కు తనలో చాలా డిఫరెన్స్ వచ్చిందన్న విషయాన్ని బుల్లితెర ప్రేక్షకులే గుర్తించారని తెలిపింది. అందుకు ప్రధాన కారణం కటెస్టెంట్స్, డైరెక్షన్ టీమ్, స్ర్కిప్ట్ రైటర్స్ అన్న సమీర.. క్రెడిట్ అంతా వాళ్లకు ఇచ్చేసింది.