వారి పెళ్లికి నో.. సహజీవనానికి ఓకే అన్న హైకోర్టు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 10:11 AM GMT
వారి పెళ్లికి నో.. సహజీవనానికి ఓకే అన్న హైకోర్టు..!

ఉత్తరాఖండ్‌ హైకోర్టు స్వలింగ సంపర్కుల కేసులో కీలక తీర్పు వెలువరిచింది. స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోరాదని, అయితే వారిద్దరు కలిసి జీవించవచ్చునని తెలిపింది. ‘మన రాజ్యాంగం బహుళ సంస్కృతులను ఆమోదిస్తుంది. పెళ్లి, భాగాస్వాముల ఎంపిక వంటివి ప్రభుత్వాలకు, సమాజానికి సంబంధం లేనివి. అయితే మనదేశంలో స్వలింగ సంప్కరులు పెళ్లి చేసుకోవడం కుదరదు. అయినప్పటికీ వారికి కలసి జీవించే స్వేచ్ఛ ఉంది. దీనికి చట్టం కూడా రక్షణ కల్పిస్తుంది’ అని జస్టిస్‌ శరత్‌కుమార్‌ శర్మ పేర్కొన్నారు.

ఇద్దరు మహిళల కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఓ మహిళతో కలసి ఉంటున్నందుకు తనను తన కుటుంబ సభ్యులు నిర్బంధించారంటూ ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. మనిషిని నిర్బంధించడం గృహహింస కిందికే వస్తుందని, ఇద్దరు స్వలింగ సంపర్కులు కలసి జీవించవచ్చని కోర్టు పేర్కొంది.

Next Story