వామ్మో..సమంత నువ్వు సూపర్
By రాణి Published on 7 March 2020 2:36 PM IST
టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత అక్కినేని ఫిట్ నెస్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. తరచూ ఆమె తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా..సమంత తన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు.
వర్కవుట్లలో భాగంగా సమంత తన పాత నేస్తమైన 100కిలోల బరువును ఎత్తి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ''మళ్లీ నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నా పాత స్నేహితుడా..100 కిలోల సుమె డెడ్ లిఫ్ట్'' అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సమంత అభిమానులు కూడా..''వామ్మో..సమంత నువ్వు సూపర్'', ''సమంత నువ్వు పవర్ ఫుల్'' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఫిబ్రవరి 14న విడుదల జాను సినిమాలో జానకిదేవిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన సమంత..త్వరలో విఘ్నేశ్ శివర్ దర్శకత్వం వహించనున్న కాత్తువక్కుల రెందు కాదల్ సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో నయనతారు, విజయ్ సేతుపతి కూడా నటించనున్నారు.
[playlist type="video" ids="34911"]
https://telugu.newsmeter.in/corona-effect-in-cine-industry/