చైతూ ట్వీట్ కు స్పందించిన సెలబ్రిటీలు..సమంతాతో సహా..
By రాణి Published on 10 March 2020 3:03 PM IST
టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ అండ్ ఫేవరెట్ కపుల్ ఎవరంటే..ఈతరం యువతకు ఠక్కున గుర్తొచ్చేది చై సామ్ జంటే. తాజాగా..నాగచైతన్య చేసిన ఓ ట్వీట్ కు తన ఫ్యాన్స్ తో పాటు..కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించారు. వారితోపాటే సమంతా కూడా రిప్లై ఇచ్చింది. ఆ ట్వీట్ ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి మాత్రం కాదండోయ్.
'' సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోని వెళ్లిపోమాకే పాట నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ సాంగ్స్ లో అది కూడా ఒకటి. మీరు కూడా మీకు ఇష్టమైన పాట ఏదో..కామెంట్ బాక్స్ ద్వారా చెప్పండి'' అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు రిప్లై ఇచ్చారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తనకు మరో చరిత్రలోని ''పదహారేళ్లకు నీలో నాలో'' అనే పాట ఇష్టమని కామెంట్ చేశారు.
Also Read : ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ హోలీ ఫొటో
అలాగే సమంత కూడా ఈ ట్వీట్ కు స్పందించింది. సమంత, నాగచైతన్యలు నటించిన ఏమాయ చేశావే సినిమాలోని ''ఈ హృదయం కరిగించి వెళ్లకే'' పాట చాలా ఇష్టమని ట్వీట్ చేసింది. ఈ రీల్ రియల్ కపుల్ ప్రేమాయణం కూడా ఆ సినిమా నుంచే పట్టాలెక్కింది కదా. అందుకే ఈ అమ్మడుకి ఆ పాట అంటే అంత ఇష్టమనుకుంటా..