టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన భార్య లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి అవ్వనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Also Read :
ఆ గొడ‌వ‌లో రాహుల్‌ తప్పే లేదు : ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌..

అలియాభట్, స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ, నితిన్ సత్య, భాల్ చంద్ర కదం, భారత్ గణేష్, విజయ్ పాట్కర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తవ్వగానే తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమాలో నటించనున్నారు.

కాగా..తారక్ చేసిన ట్వీట్ కు ఫ్యాన్స్ బాగా స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ తారక్ కు కూడా హోలీ శుభాకాంక్షలు చెప్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.