సమంతకు టెన్త్‌, ఇంటర్‌లో ఎన్ని మార్కులో తెలిస్తే ..

By సుభాష్  Published on  30 May 2020 4:18 PM IST
సమంతకు టెన్త్‌, ఇంటర్‌లో ఎన్ని మార్కులో తెలిస్తే ..

సమంత.. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగచైతన్యతోనే పెళ్లి చేసుకుంది. ఏ మాయ చేశావే మూవీతో కుర్రాళ్లను మాయలో పడేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్‌ హీరోయిన్‌లో ఒకరనే చెప్పాలి. ఇక సమంత సోషల్‌ మీడియాలో సైతం ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటారు. తన ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో యాక్టివ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే టాప్‌ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్‌ ట్విట్టర్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత యాక్టింగ్‌లోనే కాదు చదువులోనే కూడా టాపరే. దానికి సంబంధించిన మార్కుల షీట్స్‌ సోషల్‌ మీడియాలో తెర వైరల్‌ అవుతోంది.

మంచి నటనతో పాటు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సమంత. సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా సునాయాసంగా చేసే సమంత చదువులో మంచి మార్కులు సంపాదించి గుడ్‌ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. సమంత ఎంత క్లెవరో స్కూల్స్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సమంతకు 10,11వ తరగతుల్లో అదిరిపోయే మార్కులు వచ్చాయి. సీఎస్‌ఐసెయింట్‌ స్టీపెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంతకు పదో తరగతిలో గణితం పార్ట్‌-1లో 100కు 10 మార్కులు రాగా, గణితం పార్ట్‌-2లో 99 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం సమంత ట్విట్టర్‌ అకౌంట్లో కనిపిస్తున్న ఈ మార్కుల లిస్ట్‌ సోషల్‌ మీడియాలో తెర వైరల్‌ అవుతుంది.



Next Story