సల్మాన్ - పూరీ సినిమా నిజమేనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్... ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది హీరోలు పూరీతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ ఎవరితో సినిమా చేస్తాడా.. అని ఆసక్తితో ఎదురు చూశారు. ఆఖరికి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే... పూరీతో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదండోయ్... బాలీవుడ్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తుండడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పూరీతో సినిమా చేయాలనుకుంటున్నాడు. దబాంగ్ 3 ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ... పూరీని త్వరలోనే కలుస్తాను. అన్నీ కుదిరితే పూరీతో సినిమా ఉండచ్చు అని చెప్పాడు.
దీంతో సల్మాన్ - పూరీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెలిసింది. అయితే... సల్మాన్ కోసం పూరీ ఏ తరహా కథ రెడీ చేశాడు..? అనేది తెలియాల్సివుంది. మరి... సల్మాన్ తో సినిమా గురించి పూరీ స్పందిస్తాడేమో చూడాలి.