రాజస్థాన్‌ : 1998లో కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జోధాపూర్ జిల్లా సెషన్ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఈ రోజు సల్మాన్ విచారణకు హాజరుకాలేదు. గతంలో సల్మాన్‌ను ఈ కేసులో కోర్ట్ దోషిగా తేల్చింది. ఐదేళ్లు జైలు శిక్ష కూడా పడింది. సల్మాన్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. కోర్టుకు హాజరు కాకుంటే బెయిల్ రద్దు చేస్తామని కోర్ట్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ కోర్టుకు హాజరవుతారని అందరూ అనుకున్నారు. కాని..సల్మాన్ మాత్రం కోర్టుకు రాలేదు. ఈ కేసు విచారణను కోర్టు డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది. డిసెంబర్ 19 న కూడా సల్మాన్ కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు అవుతుందని జడ్జ్ వార్నింగ్ ఇచ్చారు.

మరోపక్క సల్మాన్‌ను చంపేస్తామంటూ పంజాబ్‌ యూనివర్శిటీకి చెందిన గేరీ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్‌కు ఉరిశిక్ష ఖరారైందంటూ తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్‌కు భద్రత కల్పించారు. ఈ కేసుపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.