అన్నమాట నిలబెట్టుకున్న సల్లూభాయ్..సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ

By రాణి  Published on  9 April 2020 5:18 PM GMT
అన్నమాట నిలబెట్టుకున్న సల్లూభాయ్..సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ

బాలీవుడ్ భాయ్..సల్మాన్ ఖాన్ సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమచేసి అన్నమాట నిలబెట్టుకున్నారు. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ల నటులు విరాళాలిస్తూ..నిత్యావసరాలు పంపిణీ చేస్తూ తమలో ఉన్న సహాయగుణాన్ని చాటుతున్నారు. అలాగ్ సినీ కార్మికుల ఇబ్బందులను గ్రహించిన సల్మాన్ కూడా తనకు చేతనైన సహాయం చేస్తానని ప్రకటించారు. అన్నమాట ప్రకారం 25 వేల మంది ఖాతాల్లో రూ.3000 జమచేశారు. ఈ విషయాన్ని ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ యూనియన్ గురువారం వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో రెండు మూడు విడతలుగా మరోసారి ఆర్థిక సహాయం అందజేస్తారట.

Also Read : అక్కడ కరోనాతో 11 మంది భారతీయులు మృతి

ఇక సల్మాన్ బాటలోనే యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ సుమారు 3000 మంది సినీ కార్మికుల ఖాతాల్లో రూ.5000 జమ చేసింది. బాలీవుడ్ ప్రముఖులు బోనీ కపూర్, అర్జున్ కపూర్, రోహిత్ శెట్టి లు ఫిల్మ్ ఫెడరేషన్ కు విరాళాలనందజేశారు. అదేవిధంగా ప్రొడ్యూసర్ గిల్ట్ ఆఫ్ ఇండియా కూడా బాలీవుడ్ కార్మికులకు సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. రూ.1.5 కోట్ల విరాళమిచ్చింది. విరాళాల రూపంలో వచ్చిన నగదుతో సినీ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు తివారి తెలిపారు.

Also Read : ఏప్రిల్ 22 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి ఈటెల

Next Story
Share it