తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఈ నెల 12న ఇంటి దగ్గర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో పోలీసులు షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు. ఓ యువకుడి వేధింపుల కారణంగానే యువతి సూసైడ్‌ చేసుకున్నట్లు.. ఆయువతి తల్లికి రాసిన లేఖను శనివారం పోలీసులు బయటపెట్టారు.

ఆ లేఖలో ఏం ఉందంటే.. అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉంది. కానీ వాడు బతకనివ్వట్లేదు.. తన రూమ్‌కి వచ్చి వాడి కోరికలు తీర్చాలని వేధిస్తున్నాడు. మాట వినకపోతే ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేక చచ్చిపోతున్నా. వాడిని ఏమీ చేయొద్దు. ఆ ఫోటోలు బయటపెట్టకపోతేనే.. నా ఆత్మకు శాంతి. ఐ మిస్ యూ అమ్మా’ అంటూ యువతి లేఖలో పేర్కొంది.

ఈ లేఖ ఆదారంగా పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు. లేఖలో యువతి.. తనను వేధిస్తున్న యువకుడి పేరు బయటపెట్టకపోవడంతో అతడిని పట్టుకోవడం కష్టంగా మారింది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.