బీజేపీలోకి సైనా నెహ్వాల్..!
By Newsmeter.Network
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరనున్నారని సమాచారం. బ్యాడ్మింటన్ లో ప్రతిభ కనబర్చి పలు పతకాలు సాధించిన సైనానెహ్వాల్ బ్యాడ్మింటన్ కోర్టు నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారు. సైనా భాజపాలో చేరతారన్న వార్తలు క్రీడా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బుధవారం మధ్యాహ్నం ఆమె భాజపా తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె భాజపాలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. హర్యాణాలో జన్మించిన సైనా.. 24 అంతర్జాతీయ టైటిల్స్ తో పాటు 11 సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుచుకుంది. ఒలంపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా మెడల్స్ సాధించింది. 2015లో ప్రపంచ నెం.1 ర్యాంకులో నిలిచిన 29ఏళ్ల సైనా తొలి భారతీయ మహిళా షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సైనా నెహ్వాల్ 9వ ర్యాంకులో కొనసాగుతోంది.