మా భాషకు లిపి లేదు: సాయిపల్లవి

By సుభాష్  Published on  6 April 2020 11:01 AM GMT
మా భాషకు లిపి లేదు: సాయిపల్లవి

సాయిపల్లవి.. ఈ బ్యూటీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన 'ఫిదా' మూవీతో తనకంటు ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమా సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. అంతేకాదు సాయిపల్లవి ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా, పాత్రకు తగ్గట్లుగా హావ భావాలను ఎంతో చక్కగా ప్రదర్శించగా ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకుంది. తన నటనట ద్వారా ప్రేక్షకుల్ని కట్టిపారేసింది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' సినిమా చేస్తోంది. హీరో రానా సరసన నటిస్తున్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమ కథగా, రాజకీయ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనుంది. అంతేకాదు సాయిపల్లవి మరో సినిమాలో కూడా నటిస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ అనే సినిమా నటిస్తోంది. ఈ మూవీలో నాగచైనత్య హీరోగా నటిస్తున్నాడు.

ఇక తాజాగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడుతూ.. తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఒక వేళ సినిమాల్లో రాణించకుంటే ఏం చేసేవారని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఎంబీబీఎస్‌ తర్వాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్‌ అయ్యేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఎవరికి తెలియని విషయం ఏదైనా ఉంటే చెప్పండని అడుగగా, మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు అంటూ తెలిపింది.

ఇక మీరు ఎప్పుడైన ఏడ్చారా అనే ప్రశ్నించగా.. ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదేపదే రీషూట్‌ చేస్తుండేవారు ఆ సినిమా డైరెక్టర్‌. దాంతో ఒక రోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాని అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

Next Story
Share it