పవన్‌ సినిమాలో ఐటం సాంగ్‌తో అదరగొట్టనున్న తెలుగు బ్యూటీ

By సుభాష్  Published on  6 April 2020 8:15 AM GMT
పవన్‌ సినిమాలో ఐటం సాంగ్‌తో అదరగొట్టనున్న తెలుగు బ్యూటీ

పూజిత పొన్నాడ.. ఈ బ్యూటీకి రామ్‌చరణ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ అయిన 'రంగస్థలం'లో అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్‌ కావడంతో ఈ తెలుగమ్మాయికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. నారా రోహిత్‌తో 'తుంటరి' సినిమాలో నటించి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత రంగస్థలం, కల్కి సినిమాల్లో నటించింది. అంతేకాదు 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' 'కల్కి' సినిమాల్లో కూడా నటించింది. ఈ భామ రంగస్థలం, కల్కి చిత్రాల ద్వారా తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ తెలుగమ్మాయి బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో ఆక‌ట్టుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న విశాఖకు చెందిన ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ డైరెక్షన్‌లో భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆంగ్లేయుల కాలంలో బందీపోటు పాత్రలో పవన్‌ కనిపించనున్నాడట. ఈ సినిమా కథ రాబిన్‌ హుడ్‌ తరహాలో ఉంటుందని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్‌లో తెలుగమ్మాయి పూజిత కనిపించనుందట. అంతేకాదు భారీ సెట్‌లో ఇప్పటికే పూజితపై సాంగ్‌ షూటింగ్‌ కూడా పూర్తయిందట. ఈ మూవీకి విరూపాక్ష అనే టైటిల్‌ పెట్టేందుకు చిత్ర బృందం ఆలోచిస్తోంది. ఇక పాపులర్‌ ప్రొడ్యూసర్‌ ఏఎం రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో ఐటం సాంగ్‌ పెట్టి ఫ్యాన్స్‌ను మరింత అలరించాలని భావిస్తోంది చిత్ర యూనిట్‌.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హిందీ నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ పవన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకోగా, కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది.

Next Story
Share it