బన్నీ డ్యాన్స్‌కు ఫిదా అయిన బాలీవుడ్‌ బ్యూటీ

By సుభాష్  Published on  1 April 2020 11:10 AM GMT
బన్నీ డ్యాన్స్‌కు ఫిదా అయిన బాలీవుడ్‌ బ్యూటీ

హీరో అల్లు ఆర్జున్‌ డ్యాన్స్‌కు చాలా మంది అభిమానులున్నారు. ఆయన డ్యాన్స్‌ అంటేనే చాలా మంది పడిపోతారు. ఇక ఫ్యాన్స్‌ మాట పక్కనపెడితే అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కి బాలీవుడ్‌ బ్యూటీ హ్రుతిక్‌ రోషన్‌ ఫిదా అయ్యాడు. ఏం తిన్నాడో ఏంటో.. డ్యాన్స్‌ విషయంలో మాత్రం బన్నీ అదరగొట్టేశాడు అని అచెప్పుకొచ్చారు. ఇక తాజాగా అల వైకుంఠపురములో మూవీలో అల్లు అర్జున్‌ థమన్‌ ఇచ్చిన మంచి ఆల్బమ్‌కి బన్నీ డ్యాన్స్‌ తోడై అన్ని పాటలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. అయితే అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌ చేసిన డ్యాన్స్‌కు ఓ బాలీవుడ్‌ భామ, ఐటమ్స్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌, హాట్‌ బ్యూటీ దిశా పటాని ఫిదా అయ్యింది.

ఈ బ్యూటీకి అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో 'బుట్ట బొమ్మ బుట్టబొమ్మ' అనే పాటకు వేసిన స్టెప్స్‌ బాగా నచ్చేశాయట. బన్నీ బల్ల మీద జారే స్టెప్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. అల్లు అర్జున్‌ ఎలా స్టెప్పులేశారు.. అంటూ ట్వీట్‌ చేయగా, దానికి బన్నీ కూడా నాకు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. అలా మంచి మ్యూజిక్‌ నాతో డ్యాన్స్‌ చేయిస్తుంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు అని చెప్పగా, దానికి దిశా పటాని కూడా డ్యాన్స్‌ విషయంలోమాకు స్ఫూర్తిగా ఉన్నందున థ్యాంక్యూ అంటూ బదులిచ్చింది. మొత్తం మీద అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.

Next Story
Share it