హైదరాబాద్ : ‘గద్దలకొండ గణేష్’హిట్‌తో మంచి హుషారుగా ఉన్నాడు హీరో వరుణ్ తేజ్‌. తెలుగులో ప్రసారమవుతున్న ఓ రియాల్టీ షోలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఓ ప్రశ్నకు చాలా సరదాగా సమాధానం ఇచ్చారు. ‘ఫీట్ ఆఫ్ విత్ స్టార్స్’ అనే తెలుగు రియాల్టీ షోకు మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ ఓ సరదా ప్రశ్నను వరుణ్‌ను అడిగారు. ‘రాశీ ఖన్నా, సాయి పల్లవి, పూజా హెగ్డే ఈ ముగ్గురిలో నీవు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? ఎవరితో డేటింగ్‌కు వెళ్తావు? అని అడగ్గా..వరుణ్ వెంటనే తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు. ‘ సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా, రాశీ ఖన్నాను చంపుతా, పూజాహేగ్డెతో డేటింగ్ కు వెళ్తాను’ అని సరదాగా సమాధానం చెప్పాడు.

Image result for manchu lakshmi and varun

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.