సాయి పల్లవిని మ్యారేజ్‌ చేసుకుంటా..రాశిఖన్నాను చంపేస్తా..!: వరుణ్ తేజ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sept 2019 9:32 PM IST
సాయి పల్లవిని మ్యారేజ్‌ చేసుకుంటా..రాశిఖన్నాను చంపేస్తా..!: వరుణ్ తేజ్‌

హైదరాబాద్ : 'గద్దలకొండ గణేష్'హిట్‌తో మంచి హుషారుగా ఉన్నాడు హీరో వరుణ్ తేజ్‌. తెలుగులో ప్రసారమవుతున్న ఓ రియాల్టీ షోలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఓ ప్రశ్నకు చాలా సరదాగా సమాధానం ఇచ్చారు. 'ఫీట్ ఆఫ్ విత్ స్టార్స్' అనే తెలుగు రియాల్టీ షోకు మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ ఓ సరదా ప్రశ్నను వరుణ్‌ను అడిగారు. 'రాశీ ఖన్నా, సాయి పల్లవి, పూజా హెగ్డే ఈ ముగ్గురిలో నీవు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? ఎవరితో డేటింగ్‌కు వెళ్తావు? అని అడగ్గా..వరుణ్ వెంటనే తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు. ' సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా, రాశీ ఖన్నాను చంపుతా, పూజాహేగ్డెతో డేటింగ్ కు వెళ్తాను' అని సరదాగా సమాధానం చెప్పాడు.

Image result for manchu lakshmi and varun

Next Story