సాయిపల్లవికి బంపర్‌ ఆఫర్‌..!

By సుభాష్  Published on  29 Oct 2020 4:32 PM IST
సాయిపల్లవికి బంపర్‌ ఆఫర్‌..!

నటి సాయిపల్లవి బంపర్‌ ఆఫర్‌ కొట్టిసినట్లు తెలుస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే తాను నటిస్తున్న 'వకీల్‌ సాబ్‌' సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకోగా, ఈ సినిమా పూర్తికాకుండానే పవన్‌ దర్శకులు క్రిష్‌, సురేందర్‌రెడ్డి, హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పవన్‌ హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నట్లు దసరా పండగ రోజు ప్రకటించారు. ఈ చిత్రానికి సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో మంచి విజయం సాధించిన 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌'కు ఇది రీమేక్‌. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

ఈ సినిమాలో మలయాళంలో బిజు మీనన్‌ నటించిన పోలీసు పాత్రలో పవన్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పవన్‌ సరసన నటి సాయిపల్లవి నటించనుందనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.

మాలయాళంలో బిజు మీనన్‌ నటించిన పోలీస్ పాత్రలో వన్ కళ్యాణ్ నటించనున్నారు. పృథ్వీరాజ్‌​ పాత్రలో నితిన్‌ను తీసుకోనున్నట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్‌తో నటించిన ఫిదా సినిమాతో మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పవర్‌స్టార్‌తో నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తోంది.

Next Story