తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సినిమాలు చేసి ఎంతో ‌క్రేజ్‌ సంపాదించుకుంది సాయిపల్లవి. ఫిదా సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత విడుదలైన ఎంసీఏ కూడా మంచి హిట్‌ కావడంతో ఈ అమ్మడు స్టార్‌ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో సాయిపల్లవికి కాస్త ఇమేజ్‌ దెబ్బతీశాయి. అయితే సినిమాలు ప్లాప్‌ అయినా ఈ అమ్మడుకు క్రేజ్‌ మాత్రం అలానే ఉండిపోయింది.

సినిమాకు కోటికి పైగా..

ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ సినిమాకు కోటిపైగా తీసుకుంటుంది. ఇదిలా ఉంటే గ్లామర్‌ షో విషయంలో మరోసారి కుండబద్దలు కొట్టేసింది ఈ తమిళ బ్యూటీ. తనకు లిప్‌ లాక్‌ సిన్స్‌ అయినా, హాట్‌ సన్నివేశాల్లో నటించడం అస్సులు ఇష్టం ఉండదని చెబుతోంది ఈ బ్యూటీ. ఒక వేళ స్ర్కీప్ట్‌ డిమాండ్‌ చేసినా కూడా నేను మాత్రం అలాంటి సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటాను..అని అంటోంది. కేవలం అలాంటి దృశ్యాలు ఉన్నాయనే కారణంతో ఈ మధ్య సరిలేరు నికెవ్వరు, డియర్‌ కామ్రేడ్‌ లాంటి సినిమాలను వదులుకున్నాననిన చెబుతోంది ఈ ఫిదా బ్యూటీ.  ఇక రియల్‌ లైఫ్‌లో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటానని చెబుతోంది.

అందులోనూ నటించేందుకు నో చెప్పేసింది

స్టార్స్‌ అన్నప్పుడు యాడ్‌ రావడం  అనేది సహజం. పాపులారిటీని బట్టి చిన్న చిన్న యాడ్‌ నుంచి పెద్ద యాడ్స్‌ చేసే వరకు అవకాశాలు వస్తుంటాయి. కాని సాయిపల్లవికి కొన్ని యాడ్స్‌ చేయాలంటూ కొన్ని కంపెనీలు వచ్చాయట. కోట్లు ఆఫర్‌ కూడా చేశాయట. కానీ ముద్దుగుమ్మ మాత్రం యాడ్స్‌ లోనటించేందుకు ఇష్టపడలేదట. ఓ ఫేస్‌ క్రిమ్‌ సంస్థ ఏకంగా రూ.2 కోట్లు ఆఫర్‌ చేసినా నో చెప్పేసిందట.

మంచి మనసున్న సాయిపల్లవి

సాయిపల్లవిలో కూడా మంచి మనసే ఉందని చెప్పాలి. ఈ మధ్యన ‘పడిపడి లేచే మనసు’ నిర్మాత సాయిపల్లవికి రెమ్యూనరేషన్‌లో రూ. 40 లక్షలు బాకీ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని చూశాడు. కానీ సినిమా ప్లాప్‌ కావడంతో బాకీపడ్డ పారితోషకాన్ని వద్దని చెప్పేసిందట. అలాంటి మంచి మనసు సాయిపల్లవి సొంతమనే చెప్పాలి. అంతేకాదు డబ్బుకన్నా.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెబుతోంది ఈ బ్యూటీ. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటానా… ఎంత సంపాదించినా.. రాత్రి ఇంటికెళ్లి తినేది మూడు చాపాతిలు మాత్రమేనని చెబుతోంది. తన విలువలు చంపుకొని పని చేయడం నచ్చదని, అందుకే యాడ్స్‌ లో నటించేందుకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.  ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్‌ స్టోరీ, రానా దగ్గుబాటితో విరాట పర్వం సినిమాలు చేస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.