నగ్నంగా పోజిచ్చి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ‘బాహుబలి భామ’

కొందరు హీరోయిన్లు మాత్రం పూర్తిగా దిగజారిపోతున్నారు. అవకాశాల పేరుతో ఎంతకైనా వెళ్లిపోతున్నారు. సినిమాల్లో నటించగానే పెద్దగా పేరు కాకపోవడంతో ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎలాగోలా పాపులర్‌ కావాలనే ఆశతో శరీరంపై బట్టలు సైతం లేకుండా పోజులిస్తున్నారు. ఇందుకు సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం పాపులారిటీ కావాలంటే అది సోషల్‌ మీడియానే అనే చెప్పక తప్పదు. తమ పేరు మారుమోగిపోవాలంటే ముందుగా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు ఈ భామలు. సినిమాల్లో పెద్దగా పేరు రాకపోవడంతో ఈ విధంగా పాపులర్‌ కావాలని చూస్తున్నారు కొందరు.

కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాదు. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసినా గుర్తించుకోరు కూడా. ఈ భామ పరిస్థితి కూడా అంతే మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్లతో నటించినా ఓ ముద్దుగుమ్మకు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. స్కార్లెట్‌ విల్సన్‌. పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాతో హాలీవుడ్‌లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీలో ‘బొత్తాలే తెగిపోతున్నాయ్‌ రాంబాబూ‘ అంటూ దులిపేసింది ఈ బ్యూటీ.

Scarlett Wilson1

ఆ తర్వాత రామ్‌ చరణ్‌ ‘ఎవడు’ మూవీలో ‘అయ్యోపాపం’ అంటూ ఐటం సాంగ్‌తో ప్రేక్షకులను పిచ్చేక్కించింది. ఆ వెంటనే బహుబలి ది బిగినింగ్‌ చిత్రంలో కూడా ఐటెం సాంగ్‌తో ఉర్రూతలూగించింది. కార్తీ ఖాకి సహా, గత విడుదలైన రాజశేఖర్‌ కల్కి సినిమాలో స్పెషల్‌ సాంగ్స్‌ చేసింది ఈ బ్యూటీ. ఇక కొన్నాళ్ల కిందట యాక్టర్‌ ప్రవేష్‌ రానాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాను సైతం షేక్‌ చేస్తోంది. ప్లోరిడా బీచ్‌లో మెరుస్తూ.. నగ్నంగా పోజులిచ్చింది. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.