ఎల్బీ స్టేడియంలో 'స‌ద్దుల‌ బతుకమ్మ' సంద‌డి

By Medi Samrat  Published on  6 Oct 2019 1:35 PM IST
ఎల్బీ స్టేడియంలో స‌ద్దుల‌ బతుకమ్మ సంద‌డి

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియానికి బతుకమ్మ కల వచ్చేసింది. స‌ద్దుల‌ బతుకమ్మ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. సుమారు 1200 మందికి పైగా మహిళలు సాయంత్రం బతుకమ్మ సంబరాలలో పాల్గొని.. బతుకమ్మ ఆడనున్నారు. ఇందుకోసం ఉదయం 10 గంటల నుండి స్టేడియంలో మహిళలు బతుకమ్మలను పేరుస్తున్నారు. సాయంత్రం బతుకమ్మ ఆడిన అనంతరం ఈ బతుకమ్మలను ట్యాంక్ బండ్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద నిమజ్జనం చేయనున్నారు.

Next Story