ప్రముఖ రచయిత కన్నుమూత

By సుభాష్  Published on  25 Aug 2020 1:27 PM GMT
ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రముఖ రచయిత కలువకొలను సదానంద (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పాకాలలో మరణించారు. 1939 ఫిబ్రవరి 22న జన్మించారు. సుమారు 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించి 1997లో పదవీ విరమణ చేశారు.తన 18వ ఏటనే తన రచనను ప్రారంభించిన సదానంద.. ఇప్పటి వరకకు దాదాపు 200పైగా కథలు, 100పైగా గేయాలు, 8 కథా సంపుటాలు, రెండు నవలలు రాశారు. సదానంద రాసిన కథతో 1980లో 'బంగారు బావా' చిత్రం విడుదలైంది.

అలాగే 'బంగారు నడిచిన బాట' అనే నవలకు 1966లో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. 19976లో 'నవ్వే పెదవులు ఏర్చే కళ్లు' అనే కథా సంపుటికి ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. సదానంద మృతికి పలువురు ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story