ఏపీ గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 11:42 AM GMT
ఏపీ గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల

  • ఏపీ సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల
  • ఫలితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
  • పరీక్షకు హాజరైన అభ్యర్ధులు 19,50,630
  • పరీక్షలో ఉత్తీర్ణులైనవారు 1,98,184

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీకి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

సచివాలయ పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్ధులు హాజరవగా..నియామక పరీక్షల్లో 1,98,184 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఓపెన్ కేటగిరిలో 24,583, బీసీ కేటగిరిలో 1,00,494, ఎస్సీ కేటగిరిలో 63,629, ఎస్టీ కేటగిరిలో 9,458 మంది ఉత్తీర్ణత సాధించారు.

Next Story