స‌చిన్‌కు భద్రత క‌ట్‌.. ఆదిత్య థాక్రేకు మాత్రం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Dec 2019 12:40 PM GMT
స‌చిన్‌కు భద్రత క‌ట్‌.. ఆదిత్య థాక్రేకు మాత్రం..!

టీమిండియా మాజీ క్రికెట‌ర్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కుదించింది. స‌చిన్‌కు అందుబాటులో ఉంచిన ఎక్స్‌ కేటగిరీ భ‌ద్ర‌త ఇక‌పై ఉండ‌దు. అంటే ఇక నుండి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదు. కానీ ఎస్కార్ట్‌ సదుపాయం కొన‌సాగించ‌నున్నారు.

అలాగే.. మ‌హ‌రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే త‌న‌యుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు మాత్రం భద్రతను పెంచారు. ఆదిత్యకు ఇప్పుడున్న 'వై' ప్లస్ భ‌ద్ర‌త‌ను 'జెడ్‌' ప్లస్‌కు పెంచారు. ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌ సమాచారం మేర‌కు ఆయా వ్యక్తులకున్న ముప్పును పరినణనలోకి తీసుకొన్న తర్వాత.. ఈ విషయంపై ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకొంది.

ఇదిలావుంటే.. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ప‌డ్న‌విస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు ఉన్న 'వైస కేట‌గిరా భద్రత ఇక‌పై ఆయ‌న‌కు ఉండదు. అలాగే.. మరో బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు జెడ్‌ ప్లస్‌ నుంచి ఎక్స్‌ కేటగిరీకి మార్చారు. మొత్తం మహారాష్ట్రలో 97 మందికి ప్ర‌భుత్వం భద్రతా సదుపాయాలు క‌ల్పిస్తుండ‌గా.. వారిలో 29 మంది భద్రతా కేటగిరీల‌లో మార్పులు చేశారు.

Next Story