హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన సచిన్.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 20 May 2020 11:49 AM ISTలాక్‌డౌన్ 4వ దశలో దేశంలోని సెలూన్ షాపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినా.. చాలా చోట్ల ఇంకా తెరుచుకోలేదు. కొన్ని చోట్ల తెరుచుకన్నా కరోనా భయంతో ప్రస్తుతానికి సెలూన్‌కు వెళ్లకపోవడమే మంచిదని కొందరు భావిస్తున్నారు. ఇక పురుషులకు గడ్డాలు, జుట్టు బాగా పెరిగిపోయాయి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతని సతీమణీ అనుష్క శర్మ హెయిట్ కట్ చేయగా.. టెస్టు క్రికెటర్ ఛటేశ్వర పుజారాకు ఆయన భార్య పూజా హెయిర్ కట్ చేసింది.
క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. తన కొడుకు అర్జున్ టెండ్కూలర్‌కు హెయిర్ కట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాష్ రూంలో అర్జున్‌కి సచిన్ హెయిర్ కట్ చేయగా.. అతని కూతురు సారా.. సచిన్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించడం విశేషం.
'ఓ క్రికెటర్‌గా ఎన్నో మ్యాచులు ఆడి గెలిచాను. క్రికెట్‌కు వీడ్కోలు పరికాక తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నా. ఒక తండ్రిగా పిల్లలు కోసం ఏదైన చేయాల్సి వస్తుంది. వారితో కలిసి ఆడుకోవడం, కలిసి జిమ్ చేయడంతో హాయిగా ఆనందంగా కాలం గడుపుతన్నా.నా కొడుకు అర్జున్‌కు హెయిర్ కట్ చేయడం కూడా అందులో భాగమే. హెయిర్‌కట్ చేసిన తర్వాత అర్జున్ చాలా అందంగా ఉన్నాడు. నాకు అసిస్టెంట్‌గా పని చేసినందుకు థ్యాంక్యూ ! సారా ' అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ఇటీవల సచిన్ తనకు తానే హెయిర్ కట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రైండింగ్‌లో ఉంది. సచిన్ హెయిర్ కటింగ్ చేయడంలో నైపుణ్యం చూసి కొందరు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.