హనుమంతుడి ముందా నీ గుప్పి గంతులు
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 9:57 AM ISTభారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్‌లో సచిన్ నెలకొల్పిన రికార్డులు మరెవరు నెలకొల్పలేదంటే అతిశయోక్తి కాదు. సచిన్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే సచిన్ అనే స్థాయికి ఎదిగిన క్రికెటర్. అభిమానులంతా క్రికెట్ దేవుడిగా సచిన్‌ను కొలుస్తారు. అలాంటి సచిన్ కు చాలెంజ్ విసరాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.
తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. టెండూల్కర్‌కు 'కీప్ ఇట్ అప్' పేరుతో ఓ చాలెంజ్ విసిరాడు. బ్యాట్ ను అడ్డంగా తిప్పి బంతిని పలుమార్లు కొట్టడమే ఈ ఛాలెంజ్. దీనిని యువరాజ్ పూర్తి చేసి.. ఈ చాలెంజ్‌కు సచిన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ పేర్లను నామినేట్ చేశాడు.
ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాడు సచిన్. అందరిలా చేస్తే సచిన్ ఎందుకవుతాడు. అందుకనే తన కళ్లకు గంతలు కట్టుకుని మరీ బ్యాట్ అడ్డంగా పెట్టి పలుమార్లు బంతిని కొట్టి సక్సెస్ పుల్ లా ఛాలెంజ్‌ను పూర్తిచేశాడు. అనంతరం సచిన్ మాట్లాడుతూ.. యువీ నాకిచ్చిన ఛాలెంజ్ చాలా సులభమైనది. కానీ నేను నీకు ఇప్పుడు కష్టమైన ఛాలెంజ్ ను ఇస్తున్నాను అంటూ తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెటింట్లో వైరల్ గా మారాయి. నెటీజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హనుమంతుడి ముందా నీ గుప్పి గంతులు యువీ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరీ సచిన్ చాలెంజ్‌ను యువీ స్వీకరిస్తాడో లేదో చూడాలి.