'యస్ 5- నో ఎగ్జిట్' మూవీ ప్రారంభం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 11:47 AM GMT
యస్ 5- నో ఎగ్జిట్ మూవీ ప్రారంభం

సాగా ఎంటర్ టైన్మెంట్స్ అండ్ ఆర్ ఆర్ ఆర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యస్5 - నో ఎగ్జిట్’ మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ నివ్వగా, నిర్మాత గౌతమ్ తనయుడు అర్జున్ కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. హైటెక్నికల్ వాల్యూస్‌తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీకి స్వరబ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు వినియోగించే ‘రెడ్ రేంజర్ విస్టా’ కెమెరా ఇండియన్ స్ర్కీన్‌కు 'యస్ 5' సినిమాతో రాబోతుంది. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్‌కి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ రోజు లోకేషన్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకోని రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించారు.

S5

ప్రిన్స్ మాట్లాడుతూ.. ఒక యంగ్ టీంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సన్ని కొత్త వాడు అయినా కాన్పెప్ట్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. హైటెక్నికల్ టీంను సినిమాకు సెట్ చేసాడు. నా పాత్ర చాలా కొత్తగా ఉంది. ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండని ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది ఉత్కఠంగా తెరమీదకు రాబోతుంది. మణిశర్మ మ్యూజిక్ పెద్ద అసెట్ గా నిలుస్తుంది. కథ లాక్ అయిన తర్వాత ఇంత త్వరగా సెట్స్ మీదకు సినిమా వచ్చిందంటే కారణం ప్రొడ్యూసర్స్ గౌతమ్, రాహుల్ ఇచ్చిన సపోర్ట్. డిసెంబర్ లో సినిమా కంప్లీట్ అవుతుందన్నారు.

S51

తారకరత్న మాట్లాడతూ.. దర్శకుడు సన్ని కథ ను చెప్పిన తీరు చాలా బాగుంది. కథను అతను యానిమేషన్ లో డవలెప్ చేసి వివరించినప్పుడు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మణిశర్మగారి మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ అంజి మా కథకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రిన్స్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

S53

నటుడు ఆలీ మాట్లాడుతూ.. దర్శకుడు సన్ని కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. మణిశర్మ మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉంది. హైటెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందింస్తున్నారని తెలుస్తుంది. నా క్యారెక్టర్ తప్పకుడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుందన్నారు.

Next Story