కదులుతున్న కారులో మంటలు.. లక్ష బుగ్గిపాలు
By Newsmeter.Network Published on 21 Feb 2020 10:51 AM GMTరోడ్డు పై ప్రయాణిస్తున్న కారులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో కారులోని ప్రయాణీకులు గుర్తించి కారును నిలిపివేసి.. అందలోంచి దిగి దూరంగా పరిగెత్తాతారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారులో ఉన్న లక్ష నగదు అగ్నికి ఆహుతైంది.
ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం మామడ టోల్‌గేట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై వెంటనే కారును నిలిపివేశారు. వెంటనే అందులోంచి దిగి దూరంగా వెళ్లారు. ఈ క్రమంలో కారులో ఉన్న లక్ష రూపాయలను అక్కడే వదిలేశారు. దీంతో కారుతో పాటు లక్ష రూపాయలు కూడా బుగ్గిపాలయ్యాయి. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
కొత్త కారుతో పాటు క్యాష్ కూడా అగ్నికి ఆహుతవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.