'రూల‌ర్' మూవీకి బాల‌య్య‌ రెమ్యూన‌రేషన్ ఎంతో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 10:29 AM GMT
రూల‌ర్ మూవీకి బాల‌య్య‌ రెమ్యూన‌రేషన్ ఎంతో తెలుసా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తోన్న తాజా చిత్రం 'రూల‌ర్'. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ మూవీ టైటిల్, ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసారు. అయితే.. ఫ‌స్ట్ లుక్ లోని బాల‌య్య స్టిల్‌కి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. ఈ మూవీకి బాల‌య్య రెమ్యూన‌రేష‌న్ ఎంత అనేది హాట్ టాపిక్ అయ్యింది.

కార‌ణం ఏంటంటే... సి.క‌ళ్యాణ్ బాల‌య్య‌తో 'జై సింహా' సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి గాను బాల‌య్య‌కి రూ.6 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇచ్చార‌ట‌. 'రూల‌ర్' సినిమాకి కూడా అదే మొత్తాన్ని చెల్లించాల‌ని సి.క‌ళ్యాణ్ అనుకున్నార‌ట‌. అయితే... బాల‌కృష్ణ 'రూల‌ర్' సినిమాకి రూ.12 కోట్లు డిమాండ్ చేశార‌ట‌. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. బాల‌య్య చెప్పిన రెమ్యూన‌రేష‌న్ కి సి.క‌ళ్యాణ్ నో చెప్ప‌లేరు. అందుచేత 'రూల‌ర్' సినిమాకి గాను బాల‌య్యకి రూ.12 కోట్లు ఇచ్చార‌ని తెలిసింది. సీనియ‌ర్ హీరోల్లో ఇంత ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకోవ‌డం ఇదే తొలిసారి. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న సోనాల్ చౌహాన్, వేదిక‌, భూమిక ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేయ‌నున్నారు.

Next Story
Share it