హైదరాబాద్‌: ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీనివాస రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నారు. 90శాతంపైగా శరీరం కాలి పోయింది. ప్రాధమిక చికిత్స ఖమ్మంలో అందించి..మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక్కడే వైద్యం తీసుకుంటూ శ్రీనివాస రెడ్డి మృతి చెందాడు. డ్రైవర్ శ్రీనివాస రెడ్డి మృతితో ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. శ్రీనివాస రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నాయి విపక్షాలు.

శ్రీనివాస రెడ్డి చనిపోయే ముందు ఏమన్నరో కింది వీడియోలో వినండి…

అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలోనే డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఖమ్మం  తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.  అయితే .. శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని బస్ భవన్ కు  తీసుకెళ్తామంటూ అడ్టు  తగిలారు ఆర్టీసీ జేఏసీ నాయకులు.

శ్రీనివాస రెడ్డి చనిపోవడం దురదృష్టకరం – ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి చనిపోవడం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శ్రీనివాస రెడ్డి లేని లోటు ఆయన కుటుంబానికి తీర్చలేనిదన్నారు. శ్రీనివాస రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునని చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని..25 రోజులు సమ్మె చేసి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్నారు. వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటివి దురదృష్టకరమని జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మంత్రులు చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే విపక్షాలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని ఖమ్మం తరలిస్తున్న పోలీసులు

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.