దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 9:02 AM GMT
దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడులు

అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే అనంతపురం, హిందూపురం, గుంతకల్లు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

అనంతపురంలో నాలుగు, గుంతకల్లులో నాలుగు బస్సులను సీజ్‌ చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

అనంతపురం-బెంగళూరు, అనంతపురం-బళ్లారి, అనంతపురం-సిర, గంతకల్లు-బళ్లారి రూట్లలో తిరిగే దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో పలు నిబంధనలు అతిక్రమణలు జరుగుతున్నాయని డీటీసీ శివరాంప్రసాద్‌ తెలిపారు.

అనంతపురంలో బళ్లారి రోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతాల్లో డీటీసీ శివరాంప్రసాద్‌, ఇంఛార్జి ఆర్‌టీఓ వరప్రసాద్‌, ఎంవీఐలు అతికనాజ్‌, దామోదర్‌ నాయుడు తనిఖీలు చేపట్టారు. అందుకే ఆయా బస్సులను సీజ్‌ చేశామని సృష్టం చేశారు.

Next Story
Share it