ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కన్నుమూత

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ సిద్ధాంతకర్త, రచయిత పి. పరమేశ్వరన్‌ (93) కేరళలోని పాలక్కడ్‌ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారు. పరమేశ్వరన్‌ కన్యాకుమారిలోని భారతీయ విచారణ కేంద్రం వ్యవస్థాపక డైరెక్టర్‌గా పని చేశారు. పలు సామాజిక కార్యక్రమాలకు ఎంతో కృషి చేశారు. భారతీయ జనసంఘ్‌ నేతగా పేరొందిన పరమేశ్వరన్‌ .. ప్రముఖులు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, వ్యాజ్‌పాల్‌, ఎల్‌కె అద్వానీ వంటి దిగ్గజాలతో కలిసి పని చేశారు.

పరమేశ్వరన్‌ 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషన్‌ అవార్డుతో సత్కరించింది. పరమేశ్వరన్‌ అత్యవసర రోజుల్లో అఖిల భారత సత్యాగ్రహంలో భాగంగా పరమేశ్వరన్‌ అరెస్ట్‌ అయ్యారు. 16 నెలల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. కేరలీయులలో జాతీయవాద ఆలోచనలను ప్రోత్సహించడానికి 1982లో పరమేశ్వరన్‌ ఓ కేంద్రాన్ని కూడా స్థాపించారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తదితరులు సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.