మీ అకౌంట్ లో రూ.1500 పడ్డాయా ? ఇలా తెలుసుకోండి అంటూ మంత్రి ట్వీట్
By రాణి Published on 27 April 2020 9:09 PM ISTకరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డు దారులకు ఉచితంగా రేషన్, పప్పుధాన్యాలను ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..లాక్ డౌన్ ను మరింత పెంచిన నేపథ్యంలో రెండవ విడత కూడా ఉచిత రేషన్ తో పాటు రూ.1500 ఇవ్వనున్నట్లు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.
Also Read : మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రిటీగా కనికా..పోలీస్ శాఖ నుంచి నోటీసులు
అయితే ఇంకా కొంతమంది తమకు డబ్బులు జమయ్యాయో లేదో అర్థంకాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం మంత్రి హరీష్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. మీ ఖాతాలో డబ్బులు జమయ్యాయో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదని, రేషన్ కార్డులో ఉన్న నంబర్ ను కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఎంటర్ చేస్తే నగదు జమైందో లేదో తెలుస్తుందని ట్వీట్ చేశారు.
Also Read : ఆది, వర్షిణిల మధ్య ఎఫైర్ నిజమేనా ?
నగదు జమ అయిందో లేదో తెలుసుకునేందుకు ఈ లింక్ ఓపెన్ చేసి మీ రేషన్ కార్డు పై ఉన్న నంబర్ ను, కింద ఇచ్చిన నంబర్ ను కూడా ఎంటర్ చేయండి. బ్యాంక్ లో నగదు పడిందో లేదో తెలుస్తుంది.
https://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html