'ఆర్ఆర్ఆర్' నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !  

By Newsmeter.Network
Published on : 15 Dec 2019 7:17 PM IST

ఆర్ఆర్ఆర్ నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !  

యంగ్ నట రత్న ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు బయట పడకుండా రాజమౌళి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటునప్పటికీ.. ఈ చిత్రానికి పని చేస్తోన్న సాంకేతిక బృందం నుండి ఎదో రకంగా సినిమాకి సంబధించిన కీలకాంశాలు లీకుల రూపంలో ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతూనే ఉన్నాయి. తాజాగా సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న అజయ్ దేవగణ్ కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ గా కనిపించబోతున్నాడట. అయితే అజయ్ దేవగణ్ కొన్ని సీన్స్ లోనే కనిపిస్తారట. అయినప్పటికీ.. సినిమాలో అజయ్ దేవగణ్ వల్లే తారక్ - చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని తమ పోరాట విధానాన్ని మార్చుకుంటారని.. అజయ్ దేవగణ్ పాత్ర మధ్యలో చనిపోతుందని అయిన చాల ప్రేరణాత్మకంగా ఉండనుందని తెలుస్తోంది.

ఇక రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లుగా 'ఆర్ఆర్ఆర్' జులై 30న రిలీజ్ అయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు హీరోలు గాయాలు పాలుకావడంతో పాటు ఇతర కారణాల వలన అనుకున్న ప్రకారం రాజమౌళి షూటింగ్ జరుపలేకపోయారు. క్వాలిటీ విషయంలో రాజీపడని రాజమౌళి, రిలీజ్ డేట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ఆగష్టు 15న రిలీజ్ చేస్తే బాగుంటుందని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Next Story